Mars Transits into Leo: సింహరాశిలోకి కుజుడి సంచారం.. నవంబర్ 12 నుంచి ఈ 3 రాశుల వారికి తిరుగులేని రాజయోగం..
తిరుగులేని రాజయోగం..

Mars Transits into Leo: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సేనాధిపతిగా పిలిచే అంగారకుడు ధైర్యం, పరాక్రమం, భూమి, బలానికి ప్రతీకగా భావిస్తారు. మేష, వృశ్చిక రాశులకు ఆధిపత్యం వహించే కుజుడు సాధారణంగా ఒక రాశిలో దాదాపు 45 రోజుల పాటు సంచరిస్తాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో కొనసాగుతున్న కుజుడు.. నవంబర్ 12న సూర్యుడి ఆధిపత్యంలోని సింహరాశిలోకి అడుగుపెట్టనున్నాడు.
మిత్ర క్షేత్రమైన సింహరాశిలోకి కుజుడి ప్రవేశం వల్ల మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులపై దీని ప్రభావం ఉంటుంది. అయితే, కొన్ని రాశుల వారికి వృత్తి, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో విశేష పురోగతి లభిస్తుంది. కష్టపడి పనిచేసేవారికి లక్ష్యాలు నెరవేరి, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అయితే భావోద్వేగాలు, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటిస్తే అద్భుత ఫలితాలు అందుకోవచ్చు. ముఖ్యంగా కుజుడి ఈ గోచార మార్పు వల్ల అదృష్టాన్ని అందుకోబోయే మూడు రాశుల వివరాలు:
మేష రాశి: ప్రతిభకు గుర్తింపు.. ఆదాయం వృద్ధి..
కుజుడు మేష రాశికి పంచమ భావంలోకి (5వ ఇల్లు) ప్రవేశిస్తాడు. ఉద్యోగస్తులకు తమ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశాలు లభిస్తాయి. ఆఫీసులో కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు తమ రంగాన్ని విస్తరించుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ కాలంలో ఆర్థిక రాబడి బాగుంటుంది. చేతినిండా డబ్బు సమకూరినప్పటికీ, దుబారా ఖర్చులను నియంత్రించుకోవడం అత్యంత ముఖ్యం.
వృశ్చిక రాశి: దశమ స్థానంలో కుజుడు.. కెరీర్లో కీలక మలుపు
ఈ రాశికి అధిపతే కుజుడు కావడం, ఆయన కర్మ స్థానమైన దశమ భావంలోకి ప్రవేశించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఆఫీసులో సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మంచి పురోగతి సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఓర్పుతో వ్యవహరిస్తే వృత్తిపరంగా తిరుగులేని విజయాలు సొంతమవుతాయి.
సింహ రాశి: పెరగనున్న ఆత్మవిశ్వాసం.. కొత్త ఒప్పందాలు!
కుజుడు సింహ రాశిలోనే సంచరించనున్నాడు. దీనివల్ల ఈ రాశివారిలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం భారీగా పెరుగుతాయి. ఉద్యోగస్తులు తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తపరిచి, కార్యాలయంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటారు. వ్యాపారులకు భారీ లాభాలను అందించే సరికొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేసుకోవచ్చు.
కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే తొందరపాటు పనికిరాదు. లాభనష్టాలను క్షుణ్ణంగా విశ్లేషించుకున్న తర్వాతే ముందడుగు వేయడం మంచిది.

