విషాదం

Tragedy Strikes Mohanlal’s Family: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాతృమూర్తి శాంతకుమారి (90) నిన్న మధ్యాహ్నం కొచ్చిలోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె వయోభారంతో పాటు నరాల సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు.

ఆమె భౌతిక కాయాన్ని తిరువనంతపురంలోని ముదవన్‌ముగల్‌లో ఉన్న వారి పూర్వీకుల నివాసానికి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తన ఎదుగుదలలో తల్లి పాత్ర ఎంతో ఉందని మోహన్ లాల్ పలు సందర్భాల్లో చెప్పారు. ముఖ్యంగా ఇటీవల తనకు లభించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా ఆయన తన తల్లికే అంకితం ఇచ్చారు.

ఈ వార్త తెలియగానే మలయాళ నటుడు మమ్ముట్టి, ఇతర సినీ ప్రముఖులు మోహన్ లాల్ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

శాంతకుమారి భర్త విశ్వనాథన్ నాయర్ గతంలోనే మరణించారు. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు ప్యారీలాల్ 2000వ సంవత్సరంలోనే కన్నుమూశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story