ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Renault Duster : ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలిగిన రెనాల్ట్ డస్టర్ మళ్ళీ వచ్చేస్తోంది. భారత్‌లో ఎస్‌యూవీ ట్రెండ్‌ను మొదలుపెట్టిన ఈ కారు, సరికొత్త హంగులతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం వేడుకల్లో మొదటిసారిగా దర్శనమిచ్చిన ఈ న్యూ జనరేషన్ డస్టర్, మార్చి 17న అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానుంది. పాత డస్టర్ లాగే ఇది కూడా రఫ్ అండ్ టఫ్ లుక్‌తో ఉంటూనే, నేటి కాలానికి తగ్గట్టుగా అత్యాధునిక ఫీచర్లతో ముస్తాబైంది. కార్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ కారు గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కొత్త రెనాల్ట్ డస్టర్ డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడగానే గంభీరంగా కనిపిస్తుంది. ముందు భాగంలో సన్నని ఐబ్రో స్టైల్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్, గ్రిల్‌పై పెద్దగా మెరిసే డస్టర్ లోగో కారుకు ఒక రాయల్ లుక్‌ను ఇచ్చాయి. కారు చుట్టూ ఉన్న బాడీ క్లాడింగ్, స్క్వేర్ షేప్ వీల్ ఆర్చ్‌లు, 18-అంగుళాల భారీ అల్లాయ్ వీల్స్ దీనిని ఒక పక్కా ఆఫ్-రోడ్ వెహికల్‌గా చూపిస్తున్నాయి. వెనుక వైపు సి-షేప్ టెయిల్ ల్యాంప్స్, కనెక్టెడ్ లైట్ బార్ ఈ కారుకు మోడ్రన్ టచ్ ఇచ్చాయి. లోపల కేబిన్ కూడా చాలా లగ్జరీగా ఉంది. డార్క్ బ్లాక్ థీమ్, 10.1-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కారు లోపల కూర్చుంటే ఒక ప్రీమియం అనుభూతిని కలిగిస్తాయి.

ప్రయాణికుల సేఫ్టీ విషయంలో రెనాల్ట్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసింది. ఇందులో ఏకంగా లెవల్-2 ఏడీఏఎస్ టెక్నాలజీని అందించారు. అంటే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇవే కాకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ సౌకర్యం కోసం 6-వే పవర్ అడ్జస్టబుల్ సీట్లు, డ్యూయల్ జోన్ ఆటో ఏసీ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

కొత్త రెనాల్ట్ డస్టర్ ప్రారంభ ధర దాదాపు రూ.10.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉండవచ్చని అంచనా. ఇప్పటికే రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. మార్కెట్లోకి వచ్చాక ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా సియెర్రా వంటి టాప్ మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. తన పాత ఇమేజ్‌ను మళ్ళీ వెనక్కి తెచ్చుకుని, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో డస్టర్ మళ్ళీ జెండా పాతడం ఖాయమని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story