Kia Sorento : భారత ప్రీమియం ఎస్‌యూవీ మార్కెట్‌లో టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు కియా ఇండియా సమాయత్తమైంది. తన సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ కియా సోరెంట్ ను సెప్టెంబర్ 4, 2026న భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. మన దేశంలో కియా నుంచి రాబోతున్న అత్యంత ఖరీదైన, ప్రీమియం పెట్రోల్-డీజిల్ మోడల్ ఇదే కావడం విశేషం. దీనికి సంబంధించిన అధికారిక బుకింగ్‌లు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ ఎస్‌యూవీ, భారత్‌లో తొలిసారిగా హైబ్రిడ్ టెక్నాలజీతో రాబోతోంది.

రాజసం ఉట్టిపడే డిజైన్.. అదిరిపోయే సైజ్

కియా సోరెంట్ లుక్ పరంగా ఎంతో మస్క్యులర్‌గా, అట్రాక్టివ్‌గా డిజైన్ చేయబడింది. ఇందులో సరికొత్త వర్టికల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు, టీ-షేప్ డీఆర్‌ఎల్‌లు, కంపెనీ ఐకానిక్ టైగర్ నోజ్ గ్రిల్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ఈ కారు కొలతల విషయానికొస్తే.. పొడవు 4,815 మిమీ, వెడల్పు 1,900 మిమీ, ఎత్తు 1,700 మిమీతో పాటు 2,815 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. భారీ సైజ్ కారణంగా రోడ్డుపై దీని ప్రెజెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది.

లగ్జరీ ఇంటీరియర్.. లెవెల్-2 ADAS సేఫ్టీ!

ఈ ఎస్‌యూవీ కేబిన్ వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని ఇస్తుంది. ఇది 6-సీటర్, 7-సీటర్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. డాష్‌బోర్డ్‌పై రెండు భారీ 12.3-ఇంచుల స్క్రీన్లు (ఇన్ఫోటైన్‌మెంట్ & డిజిటల్ క్లస్టర్), 4-స్పోక్ స్టీరింగ్ వీల్, రోటరీ డ్రైవ్ సెలెక్టర్ ఉన్నాయి. ప్రధాన ఫీచర్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పాన్ రమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, హెడ్-అప్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, సురక్షితమైన ప్రయాణం కోసం లెవెల్-2 ADAS సాంకేతికత ఉన్నాయి.

ఫ్యామిలీ ట్రిప్పులకు భారీ స్పేస్.. పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు

పెద్ద కుటుంబాలకు ఈ కారు చాలా అనుకూలంగా ఉంటుంది. మూడు వరుసల సీట్లు వాడినప్పుడు కూడా 179 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అదే చివరి వరుస సీట్లను మడతబెడితే ఏకంగా 2,000 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. ఇక ఇంజిన్ విషయానికొస్తే రెండు ఆప్షన్లలో రానుంది:

* 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ హైబ్రిడ్: ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో 238 HP పవర్, 380 Nm టార్క్ ఇస్తుంది.

* 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్: ఇది 202 HP పవర్, 441 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రెండు ఇంజిన్లకు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడింది. ఫ్రంట్-వీల్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లపై లాంచ్ సమయంలో పూర్తి స్పష్టత రానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story